Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jul 3 2015 @ 17:08PM

ఈ నెల ఐదు నుంచీ చంద్రబాబు జపాన్ పర్యటన

హైదరాబాద్‌, ఆంధ్రజ్యోతి, జులై :ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు రాత్రి 1:20 నిమిషాలకు జపాన్ బయలుదేరి వెళ్ళనున్నారు. అక్టోబర్ 22న విజయదశమి రోజు జరిగే కొత్త రాజధాని అమరావతి భూమిపూజకు జపాన్ ప్రధానిని ఆయన ఆహ్వానించనున్నారు. ఈ నెల ఏడున ఆయన సాఫ్ట్ బ్యాంక్ చైర్మెన్‌తో చంద్రబాబు సమావేశమవుతారు. ఈ నెల 8న జపాన్‌లోని ఓ స్మార్ట్ సిటీని సందర్శిస్తారు.