Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jul 3 2015 @ 15:03PM

గోదావరి పుష్కరాలను ప్రారంభించనున్న చినజీయర్‌స్వామి

13న భద్రాద్రి రాక 
భద్రాచలం : గోదావరి పుష్కరాలను పురస్కరించుకొని ఈ నెల 14న రాష్ట్ర ప్రభుత్వ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆహ్వానాన్ని పురస్కరించుకొని త్రిదండి చినజీయర్‌స్వామి భద్రాచలం రానున్నారు. 13న సాయంత్రం భద్రాచలం చేరుకోనున్న ఆయన 14న ఉదయం గోదావరి పుష్కరోత్సవాలను ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా భక్తులకు అనుగ్రహ భాషణం చేయనున్నారు. అలాగే తీర్ధగోష్టిలో పాల్గొంటారు. అలాగే అదేరోజు సాయంత్రంజీయర్‌ మఠంలో జరిగే గోదాదేవి-రంగనాథుల కల్యాణంలో పాల్గొంటారు. 15న వైకుంఠ ద్వార మండపంలో చినజీయర్‌స్వామి సంక్షేమ రామాయణ విరాట్‌ పారాయణాన్నినిర్వహిస్తారు. సాయంత్రం విష్ణు సహస్రనామ పారాయణ ప్రయుక్తంగా వైకుంఠ ద్వార మండపంలో అనుగ్రహ భాషణం చేస్తారు. 16న ఉదయం రాజవీధిలోని జీయర్‌మఠంలో తీర్థ గోష్టి పూర్తి చేసుకొని మంచిర్యాలలో జరిగే బ్రహ్మ యజ్ఞ నిర్వహణకు తరలివెళ్తారు. చినజీయర్‌స్వామి రాకను పురస్కరించుకొని జీయర్‌మఠం అధ్యక్షుడు పి.జనార్దన్‌భట్టార్‌, జి.వెంకటాచార్య, భద్రాద్రి దేవస్థానం అదర్వ వేద పండితులు గుదిమెళ్ల మురళీకృష్ణమాచార్యులు,. పి.కమలా రాజశేఖర్‌ తదితరులు ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.