Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jul 3 2015 @ 14:25PM

ఏబీఎన్‌తో ‘బస్తీ’ టీమ్ చిట్‌చాట్..

జయసుధ కుమారుడు శ్రేయాన్ హీరోగా పరిచయమైన చిత్రం 'బస్తీ'. ఆరడుగుల అందగాళ్ళను టాలీవుడ్‌లో వేళ్ళ మీద లెక్కించొచ్చు. కానీ వారందరికంటే పొడగరి శ్రేయాన్! ఈ యంగ్ హీరోను టాలీవుడ్ అమితాబ్ అంటూ... 'బస్తీ' ఆడియో ఆవిష్కరణలో ఆహుతులంతా అభినందనలతో ముంచెత్తారు. హైట్ విషయంలోనే కాదు... నటన విషయంలోనూ బిగ్ బి ని ఆదర్శంగా తీసుకుని కష్టపడి పేరు తెచ్చుకోవాలని పెద్దలు ఆకాంక్షించారు. జయసుధ తనయుడు అనగానే శ్రేయాన్ పట్ల ఇటు చిత్రసీమలోనే కాదు.... అటు ప్రేక్షకుల్లోనూ ఓ సాఫ్ట్ కార్నర్ ఏర్పడింది. మరి దానిని 'బస్తీ'తో శ్రేయాన్ ఎంతవరకూ నిలబెట్టుకుని సక్సెస్ ఫుల్ హీరోగా పేరు తెచ్చుకుంటాడో చూద్దాం!