Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jul 3 2015 @ 13:29PM

'కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ'పై బాలీవుడ్ ప్రముఖుల దృష్టి

ప్రస్తుతం బాలీవుడ్ లో యాక్షన్ మూవీస్ కంటే... సెంటిమెంట్ చిత్రాలకే ప్రేక్షకాదరణ బాగుంది. ఫాదర్ సెంటిమెంట్ తో తెరకెక్కిన 'పీకు', ఎంటర్ టైన్ మెంట్ ప్రధానంగా రూపుదిద్దుకున్న 'తను వెడ్స్ మను రిటర్న్స్' చిత్రాలు సాధించిన విజయాలే ఇందుకు ఉదాహరణ అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. గత కొంతకాలంగా దక్షిణాది చిత్రాల రీమేక్స్ పై దృష్టి పెట్టిన బాలీవుడ్ వర్గాలను 'కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ' చిత్రం కూడా ఆకట్టుకుందన్నది తాజా సమాచారం! తన కుమారుడు వరుణ్ ధావన్ తో ఈ సినిమాను రీమేక్ చేయాలనే ఆలోచనలో సీనియర్ డైరెక్టర్ డేవిడ్ ధావన్ ఉన్నారట!ప్రముఖ దర్శకుడు డేవిడ్ ధావన్ శిష్యుడు ఉమేశ్ గాడ్గే రూపొందించిన తాజా మరాఠీ చిత్రం 'వెల్ కమ్ జిందగీ' గత వారం విడుదలై ఘన విజయాన్ని సాధించింది. ప్రస్తుతం 'క్యా కూల్ హై హమ్ -3' చిత్రాన్ని రూపొందిస్తున్న ఉమేశ్ కు 'కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ' చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయాలనే ఆలోచన కలిగిందట. 'ఏబీసీడీ -2' మూవీతో మరో సూపర్ హిట్ ను తన ఖాతాలో జమచేసుకున్న వరుణ్ ధావన్ తో ఈ సినిమాను రీమేక్ చేయాలని ఉమేశ్ భావిస్తున్నాడట. మదర్ సెంటిమెంట్ తో పాటు... ప్రేమలోని గొప్పతనాన్ని చాటిన 'కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ' చిత్రం ప్రస్తుతం బాలీవుడ్ లోని ట్రెండ్ కు సరిగ్గా సరిపోతుందని గురుశిష్యులు డేవిడ్ ధావన్, ఉమేశ్ గాడ్గే నమ్మకంలా ఉంది. మరి ఈ చిత్రాన్ని ఇప్పటికే హిందీలో రీమేక్ చేయడానికి నిర్ణయించుకున్న లగడపాటి శ్రీధర్... హక్కుల్ని వేరొకరికి ఇస్తారా లేక ఆయనే అక్కడా పునర్ నిర్మిస్తారా అన్నది చూడాలి!