Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jul 3 2015 @ 13:06PM

దర్శకుడు సుకుమార్.. త్రివిక్రమ్ బాటలో నడవబోతున్నాడా!?

సినిమాలను తెరకెక్కించడంలో తనది డిఫరెంట్ స్టయిల్ అని ప్రూవ్ చేసుకున్న దర్శకుడు సుకుమార్... ప్రస్తుతం సుక్కు ఎన్టీఆర్ తో సినిమా తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నాడు... మహేశ్ బాబు హీరోగా వచ్చిన నేనొక్కడినే మూవీ ఫెయిల్యూర్ అయినా... తనతో సినిమా తీసే ఛాన్స్ ను సుకుమార్ కు ఇచ్చాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. చాలా రోజుల క్రితమే క్లాప్ కొట్టిన ఈ సినిమా ఇంకా సెట్స్ మీదకు వెళ్లకపోవడంతో... అసలు ఎన్టీఆర్ సుకుమార్ కాంబినేషన్ ఉంటుందా లేదా అనే దానిపై కూడా ఊహాగానాలు మొదలయ్యాయి... అయితే సినిమా షూటింగ్ ఆలస్యం కావడానికి దర్శకుడే సుకుమారే కారణమని ఇండస్ట్రీ వర్గాల మాట... త్రివిక్రమ్ బాటలో వెళ్లాలనుకుంటున్న సుకుమార్... సినిమా ఆలస్యానికి తానే స్వయంగా కారణమవుతున్నాడట. సినిమా షూటింగ్ ను అనుకున్న సమయం కంటే లేటుగా ఫినిష్ చేసే సుకుమార్... మధ్య మధ్యలో చాలా మార్పులు చేస్తుంటాడనే టాక్ ఉంది. ఒకప్పుడు ఇలాంటి వర్కింగ్ స్టయిల్ నే అనుసరించిన త్రివిక్రమ్... మహేశ్ బాబు హీరోగా తెరకెక్కిన ఖలేజా సినిమాను రెండేళ్లకు పైగా షూట్ చేశాడు. ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో కొత్త పాఠాలు నేర్చుకున్న త్రివిక్రమ్... ఆ తరువాత వరుసగా జులాయి, అత్తారింటికి దారేది, సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాల షూటింగ్ లను అనుకున్న సమయానికే పూర్తి చేశాడు.... అంతకు ముందులా కాకుండా... స్క్రిప్ట్ వర్క్ పక్కాగా పూర్తయిన తరువాతే షూటింగ్ మొదలుపెట్టడం వల్లే త్రివిక్రమ్ షూటింగ్ లను అనుకున్న సమయానికి పూర్తి చేశాడని సన్నిహితులు చెబుతున్నారు... ప్రస్తుతం తివిక్రమ్ బాటలోనే పయనించాలని భావిస్తున్న సుకుమార్... ముందు స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయిన తరువాతే సినిమా షూటింగ్ మొదలుపెట్టాలని గట్టిగా డిసైడయ్యాడట. అందుకే షూటింగ్ స్టార్ట్ కావడానికి ఇంత టైమ్ తీసుకున్నాడట.... ఏదేమైనా త్రివిక్రమ్ స్టయిల్లో తొందరగా సినిమా షూటింగ్ ను పూర్తి చేయాలని చూస్తున్న సుకుమార్.. మాటల మాంత్రికుడి రేంజ్ లో సక్సెస్ కూడా సాధిస్తాడేమో చూడాలి...