Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jul 3 2015 @ 13:02PM

అందాల రాక్షసికి హిట్ ఇవ్వబోయే హీరో ఎవరో!?

సినిమాల్లో అవకాశాలు విరివిగా దక్కాలని ఎంతగానో కోరుకునే ఆన్ స్క్రీన్ ముద్దుగుమ్మలు... అదే స్థాయిలో సక్సెస్ లు కూడా పలకరించాలని పరితపించిపోతుంటారు... చెప్పుకునే స్థాయి హిట్ లేకపోతే ఎన్ని సినిమాల్లో నటించినా... ఆ హీరోయిన్స్ ను పెద్దగా పట్టించుకోరు చాలామంది దర్శకనిర్మాతలు... దీంతో తాము నటించే సినిమాలు పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటుంటారు అందాల తారలు.... ప్రస్తుతం టాలీవుడ్ అప్ కమింగ్ బ్యూటీ లావణ్య త్రిపాఠి కూడా అదే పాట పాడుతోంది.... అందాల రాక్షసి సినిమాలో తెలుగు తెరకు పరిచయమైన ఈ ఉత్తరాది భామ... అప్పటి నుంచి సక్సెస్ కోసం ఎంతగానో ప్రయత్నిస్తోంది.... తొలి సినిమా ఫెయిల్యూర్ అయినా... ఆ తరువాత నటించిన 'దూసుకెళ్తా' సక్సెస్ కావడంతో... ఈ అందాల తారకు ఇండస్ట్రీలో నిలదొక్కుకునే అవకాశం దక్కింది... ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాల్లో నటిస్తున్న లావణ్య త్రిపాఠి... ఈ సారి ఎలాగైనా గ్రాండ్ సక్సెస్ దక్కుతుందని ఎంతో నమ్మకంగా ఉందట... నాని హీరోగా తెరకెక్కుతున్న 'భలె భలె మొగాడివోయ్' సినిమాతో పాటు స్టార్ హీరో నాగార్జున సరసన 'సొగ్గాడే చిన్నినాయన' సినిమాలోనూ నటిస్తున్న లావణ్య... ఈ రెండిటిలో వైవిధ్యభరితమైన క్యారెక్టర్స్ పోషిస్తోందట. నాని సినిమాలో ఫుల్ మోడ్రన్ గర్ల్ గాను... నాగార్జున సరసన పక్కా పల్లెటూరి అమ్మాయిగా కనువిందు చేయబోతోందట.... ఈ రెండు సినిమాలు కూడా నెలల గ్యాప్ తోనే ప్రేక్షకుల మందుకు వచ్చే అవకాశం ఉండటంతో... ఈ సారి ఎలాగైనా ఆడియెన్స్ ను మెప్పించే బంపర్ హిట్ దక్కుతుందని... అమ్మడు తెగ ఆశ పడుతోందట... మరి సక్సెస్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న ఈ అందాల రాక్షసి కోరికను ఏ హీరో నెరవేరుస్తాడో చూడాలి...