Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jul 3 2015 @ 07:06AM

గుంటూరులో జర్మనీ బృందం ఎల్‌ఈడీ బల్బుల వినియోగంపై ఆరా

 గుంటూరు: రాజధాని ప్రాంతంలోని కీలకమై న గుంటూరు జిల్లాలో గురువారం జర్మనీ జాతీయ బ్యాంకు ప్రతినిధుల బృందం పర్యటించింది. ఇటీవల ఇంటింటికి రెండు ఎల్‌ఈడీ బల్బులను పంపిణీ చేసిన ఈఈఎస్‌ఎల్‌ పథకానికి నిధుల సమకూర్చిన జర్మనీ జా తీయ బ్యాంకు (కే ఎఫ్‌డ బ్ల్యూ) ప్రతినిధుల ప్రత్యేక బృందం జిల్లాలో ఎల్‌ఈడీ బల్బుల పంపిణీ, వినియోగంపై ఆరా తీసింది. బృందం ప్రతినిధులు డాక్టర్‌ ఉషారావు, జార్జ్‌తో పాటు పలువురు ఎస్‌ఈ బి.జయభారత్‌రావుతో గుంటూరులోని విద్యుత్‌భవన్‌లో ప్రత్యేకంగా సమా వేశమయ్యారు. జిల్లాలో 18లక్షల 62వేల ఎల్‌ఈడీ బల్బులను పంపిణీ చేసినట్లు ఎస్‌ఈ వారికి వివరించారు. ఎల్‌ఈడీ బల్బులతో గతంలో కంటే విద్యుత్‌ డిమాండ్‌ తగ్గిందని పేర్కొన్నారు.

పలు ప్రాంతాల్లో పర్యటన
జర్మనీ జాతీయ బ్యాంకు బృందం ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించారు. గుంటూరులోని సంగడిగుంట, సాయిబాబాకాలనీతో పాటు ప్రాంతాల్లో ఇళ్లలోకి వెళ్లి ఎల్‌ఈడీ బల్బుల వినియోగాన్ని, ప్ర యోజనాన్ని ప్రజల ను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో విద్యుత్‌ శాఖ అధికారులతో పాటు బ ల్బుల పం పిణీ కో ఆర్డినేటర్‌ ప్రసాద్‌ పాల్గొన్నారు.