Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jul 3 2015 @ 06:40AM

మద్యం షాపులపై ’ఎక్సైజ్‌’ దాడులు

గుంటూరు (కార్పొరేషన్‌): కొత్త మద్యం షాపుల్లో విక్రయాల తీరును పరిశీలించేందుకు జిల్లా ఎక్సైజ్‌ శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు దాడులు నిర్వహించారు. అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆదిశేషు ఆధ్వర్యంలో గురువారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. బాపట్ల సర్కిల్‌ పరిధిలోని చందోలు, జమ్ములపాలెంలో ఎంఆర్‌పీ ఉల్లంఘిస్తూ ఇష్టారాజ్యంగా మద్యం విక్రయిస్తున్న షాపులపై కేసులు నమోదు చేశారు. చందోలులో క్వార్టర్‌ బాటిల్‌కు రూ. 15, జమ్ముల పాలెంలో క్వార్టర్‌ బాటిల్‌కు రూ. 10 చొప్పున అదనంగా వసూలు చేస్తున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు ఆయా షాపులపై ఎంఆర్‌పీ ఉల్లంఘన కేసులు నమోదు చేశారు. సత్వరమే చర్యలు తీసుకోవాలని తెనాలి ఈఎస్‌ మహే్‌షను ఆదేశించారు. ఈ సందర్భంగా ఏసీ ఆదిశేషు మాట్లాడుతూ జిల్లాలో నూతన మద్యం వ్యాపారులు ఎంఆర్‌పీని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా వ్యాప్తంగా నరసరావుపేట, గుంటూరు, డివిజన్‌లలో ఆయా మద్యం షాపుల్లో దాడులు నిర్వహిస్తామని తెలిపారు. జిల్లాలోని మద్యం షాపుల్లో ఎక్కడైన ఎంఆర్‌పీ ఉల్లంఘన జరిగితే తన సెల్‌కు 9440902266 ఫిర్యాదు చేయాలన్నారు. జిల్లాలోని ప్రభుత్వ మద్యం దుకాణాల ఏర్పాటు పూర్తి అవుతోందన్నారు. పిడుగురాళ్ల, మాచర్ల, గురజాల, సాతులూరు, చిలకలూరిపేట, మంగళగిరి, తాడికొండ, తుళ్లూరు, నారాకోడూరు, రేపల్లె, పొన్నూరులలో ప్రభుత్వ మద్యం దుకాణాలను ఇప్పటికే నెలకొల్పారన్నారు. మిగిలిన షాపులనూ ప్రారంభించేందుకు తగు చర్యలు తీసుకోవాలని ఇన్‌స్పెక్టర్లను ఆదేశించామన్నారు. ళ్వోపసఃో