Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jul 3 2015 @ 06:39AM

అధికారులకు కోర్టు ధిక్కార నోటీసులు

నరసరావుపేట : హైకోర్టు ధిక్కారణ కేసులో కలెక్టర్‌, ఎస్పీ, నరసరావుపేట మునిసిపల్‌ కమిషనర్‌, డీఎస్పీలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. షాపింగ్‌ కాంప్లెక్స్‌ల సెల్లార్లు, ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణ అంశాల పై కోర్టు ఇచ్చిన తీర్పును అధికారులు అమలు చేయలేదని గత ఏడాది పట్టణానికి చెందిన న్యాయవాదులు పీ రాజశేఖర్‌, బీ సలీం హైకోర్టులో కోర్టు ధిక్కారణ కేసు దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను పరిశీలించిన కోర్టు గత నెల 24న అధికారులకు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో సమాధానం చెప్పాలని నోటీసుల ద్వారా కోర్టు ఆదేశించింది. ఈ నోటీసుల నేపథ్యం ఇలా ఉంది. నరసరావుపేట పట్టణంలో షాపింగ్‌ కాంప్లెక్స్‌ల సెల్లార్లలో అక్రమ షాపుల తొలగించి, పార్కింగ్‌కు వినియోగించాలని, ట్రాఫిక్‌ను క్రమబద్ధ్దీకరించాలని పట్టణానికి చెందిన న్యాయవాదులు పీ రాజశేఖర్‌, బీ సలీం హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. దీని పై కోర్టు విచారణ చేపట్టింది. న్యాయవాదుల వాదనకు అనుగుణంగా కోర్టు అధికారులను ఆదేశించింది. ఈ ఉత్తర్వులు అమలుకు నోచుకోలేదు. సెల్లార్లలో షాపులు తొలగించినట్లుగా మునిసిపాలిటీ చిత్రీకరించే ప్రయత్నం చేసింది. దీంతో 2014లో కోర్టు ధిక్కారణ కేసును హైకోర్టులో దాఖలు చేశారు. దీనిని స్వీకరించిన కోర్టు నాలుగు వారాలలో సమాధానం చెప్పాలని అధికారులకు కోర్టు నోటీసులు జారీ చేసింది.