Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jul 3 2015 @ 02:20AM

కోస్తా మీదుగా ద్రోణి

విశాఖపట్నం, జూలై 2 (ఆంధ్రజ్యోతి): ఒడిసా నుంచి కోస్తా మీదుగా అల్పపీడనద్రోణి కొనసాగుతోంది. ఇంకా ఎండల ప్రభావంంతో రెండు రాష్ట్రాల్లో క్యుములోనింబస్‌ మేఘాలు ఏర్పడి అక్కడక్కడా వర్షాలు కురిశాయి. గురువారం ఉదయం వరకు పినపాకలో ఏడు, హసనపర్తిలో ఆరు, గంగాధరలో ఐదు, చింతపల్లి, అసిఫాబాద్‌, జనగాంలలో నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రానున్న ఇరవై నాలుగు గంటల్లో రెండు రాషా్ట్రల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం తెలిపింది. గురువారం తిరుపతిలో 39 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.