Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jul 3 2015 @ 01:30AM

వావ్రింకా, క్రీజెర్‌ నగ్నంగా పోజులు

లండన్‌: స్విట్జర్లాండ్‌ టెన్నిస్‌ స్టార్‌ స్టానిస్లాస్‌ వావ్రింకా, అమెరికా మహిళా ఫుట్‌బాలర్‌ అలీ క్రీజెర్‌ ఓ మేగజైన్‌కు నగ్నంగా పోజులిచ్చి వార్తల్లోకెక్కారు. స్పోర్ట్స్‌ మేగజైన్‌ ఈఎస్‌పీఎన్‌ (ది బాడీ ఇష్యూ) 2015 ఎడిషన్‌కు ఈ ఇద్దరూ న్యూడ్‌గా పోజులిచ్చారు. ఈ మేగజైన్‌ శుక్రవారం మార్కెట్‌లోకి విడుదలకానుంది. వావ్రింకా ప్రస్తుతం వింబుల్డన్‌లో ఆడుతుండగా.. కెనడాలో జరుగుతున్న మహిళల ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌లో క్రీజెర్‌ అమెరికాకు ప్రా తినిధ్యం వహిస్తోంది. కాగా, ఈ మేగజైన్‌ కోసం ఈ ఇద్దరూ ఒంటిపై నూలు పోగు కూడా ధరించకుండానే ఫొటో షూట్‌లో పాల్గొన్నారు. ఈ ఫొటోలో క్రీజెర్‌ బట్టల్లేకుండా కాలికింద గోల్డెన్‌ ఫుట్‌బాల్‌తో కనిపించింది. వావ్రింకా కూడా చేతిలో టెన్నిస్‌ రాకెట్‌ పట్టుకుని బ్యాక్‌హాండ్‌, ఫోర్‌హ్యాండ్‌ షాట్లు ఆడుతూ కనిపించాడు.