Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jul 2 2015 @ 18:33PM

మోక్ష గణపతిగా ఖైరతాబాద్ గణేషుడు..
ఈసారి 60 అడుగులు..

హైదరాబాద్, జులై 02: వినాయక చవితి పండుగ వస్తుందనగానే తెలుగు రాష్ట్రాల ప్రజలకు ముందుగా స్ఫురణకు వచ్చే స్వామి హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ గణపతి. ఏటేటా సరికొత్త రూపంతో కొండంత ఎత్తున కొలువై అనుగ్రహించే ఖైరతాబాద్ బడా గణేష్ ఈ సారి ఏ రూపంలో.. ఎంత ఎత్తున దర్శనమివ్వనున్నాడనే సందేహాలకు ఖైరతాబాద్ గణేష్‌ ఉత్సవ కమిటీ తెరదించింది. శక్తిమయ మోక్ష గణపతి రూపంలో 60 అడుగుల బొజ్జ గణపయ్య విగ్రహాన్ని ఈ ఏడాది ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన నిర్మాణ కార్యకలాపాలు ఇప్పటికే మొదలై కొనసాగుతున్నాయని ఖైరతాబాద్ గణేష్‌ ఉత్సవ కమిటీ చైర్మన్‌ సుదర్శన్‌ తెలిపారు. మోక్ష గణపతి చిత్రాన్ని కూడా ఈ సందర్భంగా మీడియాకు విడుదల చేశారు.