Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jul 2 2015 @ 13:47PM

ఆదిలాబాద్‌ : ఆటో చార్జీలు తగ్గించాలని గ్రామస్థుల నిరసన

ఆదిలాబాద్‌, జులై 2 : జిల్లాలోని ఆసిఫాబాద్‌ నియోజకవర్గం కేరామెరి మండలం సాంఘ్వి గ్రామంలో ఆటోల అధిక చార్జీలకు నిరసనగా గ్రామస్థులు, విద్యార్థులు గురువారం ఆందోళనకు దిగారు. సాంఘ్వి గ్రామంలో బస్సులు రాని కారణంగా స్థానికులు విద్యార్థులను ఆటోల్లో కెరామెరికి తరలిస్తుంటారు. అయితే ఆరు కిలో మీటర్లకే ఆటోవాలాలు రూ.15 వసూలు చేస్తున్నారు. ఇందుకు నిరసనగా విద్యార్థులతో కలిసి గ్రామస్థులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఇకపై విద్యార్థులను ఆటోల్లో పంపించేది లేదని గ్రామస్థులు తీర్మానించారు.