Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jul 2 2015 @ 11:12AM

రానా ట్విట్టర్‌లో 1 మిలియన్ ఫాలోవర్స్

రానా విషయంలో సక్సెస్, ఫెయిల్యూర్స్ ఎలా ఉన్నా.. స్నేహశీలిగా మంచి పేరే ఉంది. తోటి హీరోలతో స్నేహంగా మెలగడమే కాదు.. సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటాడు రానా. ఇక బాహుబలి క్రేజ్ ఉండనే ఉంది. దీంతో ట్విట్టర్ లో రానాను ఫాలో అయ్యే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా ఈ సంఖ్య పదిలక్షల మైలురాయికి చేరువయింది. ఇప్పటివరకూ టాలీవుడ్ లో నాగార్జున, మహేశ్ బాబు మాత్రమే మిలియన్ ఫాలోవర్స్ ఉన్న హీరోలు. పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ కు ఉన్న ఫాలోవర్స్ కూడా 5 లక్షల లోపే. దీంతో.. నాగ్, మహేశ్ తర్వాత ఆ రేంజ్ ట్విట్టర్ ఫాలోవర్స్ ఉన్న హీరో రానానే అయ్యాడు. మరి.. బాహుబలి విడుదలకు ముందే.. నెటిజన్స్ లో ఇంతలా ఫాలోవర్స్ ను పెంచుకున్న రానా.. ఆఫ్టర్ రిలీజ్ ఇంకెంతలా చెలరేగిపోతాడో చూడాలి..!