Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jul 1 2015 @ 23:49PM

పసిడి వ్యాపార సంపన్నుడు కల్యాణ్‌ జువెలర్స్‌ చైర్మన్‌ కల్యాణరామన్‌

సింగపూర్‌: పసిడి వ్యాపారం నిర్వహిస్తున్న భారత సంపన్నుల్లో కల్యాణ్‌ జువెలర్స్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ టిఎస్‌ కల్యాణరామన్‌ అగ్రస్థానంలో నిలిచారు. ఈయన వ్యక్తిగత సంపద 130 కోట్ల డాలర్లుగా ఉందని వెల్త్‌ఎక్స్‌ నివేదిక వెల్లడించింది. జాబితాలో రెండో స్థానంలో ఫైవ్‌స్టార్‌ డైమండ్స్‌ సారథి నిరవ్‌ మోడీ నిలిచారు. ఈయన సంపద 110 కోట్ల డాలర్లు ఉంది. మూడో స్థానంలో మలబార్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ చైర్మన్‌ ఎంపి అహమ్మద్‌ నిలిచారు. ఈయన సంపద 100 కోట్ల డాలర్లుగా ఉంది. 70 వేల డాలర్లతో తొలి మలబార్‌ గోల్డ్‌ అండ్‌ డైమండ్‌ షోరూమ్‌ను అహమ్మద్‌ ప్రారంభించారు.