Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jul 1 2015 @ 03:09AM

జీవన భృతి కోసం కదం తొక్కిన బీడీ కార్మికులు

జగిత్యాల సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ధర్నా
జగిత్యాల, జూన్‌ 30 : కరీంనగర్‌ జిల్లా జగిత్యాలలో మంగళవారం బీడీ కార్మికులు కదం తొక్కారు. బీడీలు చుడుతున్న తమకు జీవనభృతి చెల్లించాలంటూ జగిత్యాల సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. జగిత్యాల డివిజన్‌లోని 14 మండలాల నుంచి ప్రత్యేక వాహనా ల్లో ఉదయం జగిత్యాలకు చేరుకున్న బీడీ కార్మికులు పట్టణంలోని ప్రధాన వీధుల గుండా భారీ ర్యాలీ తీశారు. అనంతరం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 5 వేలకు పైగా బీడీ కార్మికులు తరలివచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.