Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jul 1 2015 @ 02:44AM

విద్యుత్‌ సంస్థల విభజనపై ప్రతిష్టంభన

  • ఏపీకి 900 కోట్లు చెల్లింపుపై తెలంగాణ ససేమిరా
  • అర్ధాంతరంగా ముగిసిన జెన్‌కో సీఎండీల చర్చలు
హైదరాబాద్‌, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఆస్తులు, అప్పులు అధికారిక విభజన చర్చల మధ్య ప్రతిష్టంభన ఏర్పడింది. తెలంగాణ రూ. 900 కోట్ల వరకు ఆంధ్రప్రదేశ్‌కు చెల్లించాల్సి రావడం, అందుకు తెలంగాణ ప్రభుత్వం సంసిద్ధంగా లేకపోవడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలకు సంబంధించిన ఈ విభజన కోసం ఆంధ్రప్రదేశ్‌ జెన్‌కో సీఎండీ విజయానంద్‌, తెలంగాణ జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావులు సోమ, మంగళవారం వరుసగా భేటీ అయ్యారు. ఆస్తులు, అప్పుల పంపకాలు, విభజనకు సంబంధించి ఇరువురు కలిసి ఒక ఫార్ములాను రూపొందించారు. ఆ ప్రకారమే ముసాయిదాను తయారు చేశారు. ఈ ప్రకారం రూ. 900 కోట్లు ఏపీ జెన్‌కోకు.... తెలంగాణ జెన్‌కో చెల్లించాల్సి వస్తోంది. అయితే ఈ చెల్లింపులకు తెలంగాణ సీఎండీ ప్రభాకరరావు అంగీకరించకపోవడంతో మంగళవారం చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది. దాంతోపాటు విద్యుత్‌ సంస్థల విభజనను పునర్విభజన చట్టం ప్రకారం చేయాలా? షీలాబిడే కమిటీ సూచనల ప్రకారం చేయాలా? అనే విషయంలోనూ ఏకాభిప్రాయం లేకపోవడంతో చర్చలు అర్థాంతరంగానే ముగిసాయి.