Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jul 1 2015 @ 02:37AM

ట్యాపింగ్‌పై ఎంతవరకైనా వెళతాం!: ఏపీ డీజీపీ

విశాఖపట్నం, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి): ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు దర్యాప్తులో ఎంతవరకైనా వెళతామని ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ జేవీ రాముడు స్పష్టం చేశారు. ఓ అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకు మంగళవారం విశాఖపట్నం వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు దర్యాప్తు ఎంతవరకు వచ్చిందని ప్రశ్నించగా... ‘‘కేసు దర్యాప్తు బాధ్యతలను సిట్‌కు అప్పగించాం. దర్యాప్తు సాగుతున్నందున, వివరాలను ఇప్పుడు బహిర్గతం చేయలేం. అయితే, ఈ కేసు దర్యాప్తులో ఎంతవరకైనా వెళతాం’’ అని తెలిపారు.