Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jul 1 2015 @ 01:56AM

అధిక నిధులివ్వండి.. కేంద్ర మంత్రి నిహాల్‌కు కేటీఆర్‌ వినతి

తెలంగాణకు అధిక నిధులు ఇవ్వాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి కేటీఆర్‌.. కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి నిహాల్‌చంద్‌ను కోరారు. మంగళవారం ఇక్కడి ఎన్‌ఐఆర్‌డీలో ఆయనకేంద్ర మంత్రిని కలిశారు. ఒక రోజు పర్యటనలో భాగంగా హైదరాబాద్‌ వచ్చిన నిహాల్‌కు... తెలంగాణలో పంచాయతీరాజ్‌ శాఖ ద్వారా చేపట్టిన కార్యక్రమాలను కేటీఆర్‌ వివరించారు. కాగా, కేటీఆర్‌ వినతులపై త్వరలోనే సమాచారం ఇస్తామని నిహాల్‌చంద్‌ తెలిపారు.