Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jul 1 2015 @ 01:14AM

గవర్నర్‌ తిరుపతికే పరిమితమైతే మంచిది: చలసాని

  • ఆయన తీరు ప్రజాస్వామ్య విరుద్ధం
  • 8 అమలు చేయలేకుంటే గవర్నర్‌ తప్పుకోవాలి: విద్యార్థి జేఏసీ
  • సెక్షన్‌ అమలయ్యేలా చూడండి: గెజిటెడ్‌ ఉద్యోగులు
విశాఖపట్నం, జూన్‌ 30: హైదరాబాద్‌లో సెక్షన్‌ 8 అమలు జరగాల్సిందేనని ఆంధ్రా మేధావుల ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. విశాఖలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణలోని పరిస్థితులు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయన్నారు. ఒక అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌పై దాడి జరిగితే కనీస స్పందన లేదని అన్నారు. స్కాలర్‌షిప్స్‌ పంపిణీ, పరీక్షా ఫలితాల్లో వివక్ష చూపడం విచారకరమన్నారు. ఇటువంటి పరిస్థితులను చక్కదిద్దాల్సిన గవర్నర్‌.. అన్నీ ఆ వెంకటేశ్వరస్వామి చూసుకుంటాడని పేర్కొనడం విచారకరమన్నారు. అలాంటప్పడు ఆయన తిరుపతి ఆలయ ప్రాంగణానికి పరిమితమైపోతేనే మంచిదన్నారు. గవర్నర్‌ ప్రజాస్వామ్య విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. జయప్రకాష్‌ నారాయణ ద్వంద్వ వైఖరిని మానుకోవాలన్నారు. ఆయన ప్రకటనలు, విధానాలు అయోమయానికి గురిచేస్తున్నాయని చెప్పారు. కాగా సెక్షన్‌-8 అమలు చేయాలని కోరుతూ ఏపీ విద్యార్థి జేఏసీ, టీఎన్‌ఎ్‌సఎఫ్‌ సంయుక్తంగా అనకాపలిల్లో ఆందోళన నిర్వహించాయి. ఈ సందర్భంగా జరిగిన సభలో చలసాని మాట్లాడుతూ కేసీఆర్‌ హైదరాబాద్‌ను తన సొంత జాగీరులా భావిస్తున్నారని విమర్శించారు. సీమాంధ్రులను సొంత బిడ్డలుగా చూసుకుంటానని చెప్పిన ఆయన, అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. హైదరాబాద్‌లో సీమాంధ్రవాసులు ఎటువంటి అభద్రతకు లోనుకాకుండా ఉండాలంటే సెక్షన్‌-8ని అమలు చేయాల్సిందేనని అన్నారు. సెక్షన్‌-8ను అమలులో గవర్నర్‌ మీనమేషాలు లెక్కిస్తున్నారని ఏపీ విద్యార్థి జేఏసీ ఉత్తరాంధ్ర ప్రతినిధి దూలం గోపి విమర్శించారు. మరోవైపు, హైదరాబాద్‌లో ఏపీ ఉద్యోగులకు శాంతిభద్రతలు కరువయ్యాయని, వెంటనే సెక్షన్‌ 8 అమలయ్యేలా చూడాలని ఆంధ్రప్రదేశ్‌ గెజిటెడ్‌ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏవీ పటేల్‌ ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. ఈ మేరకు సంఘం నేతలు చంద్రబాబును కలిసి వినతిపత్రం ఇచ్చారు.