Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jul 1 2015 @ 00:23AM

ఎపి,తెలంగాణ ఐటీ ప్రిన్సిపల్‌ చీఫ్‌ కమిషనర్‌గా సురేష్‌ బాబు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌) : ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాషా్ట్రల ఆదాయ పన్ను శాఖ ప్రిన్సిపల్‌ చీఫ్‌ కమిషనర్‌గా ఐ సురేష్‌ బాబు మంగళవారం బాధ్యతలను స్వీకరించారు. 1979 బ్యాచ్‌ ఇండియన్‌ రెవెన్యూ సర్వీసెస్‌ (ఐఆర్‌ఎస్‌) అధికారి అయిన ఈయన ఎపి, తెలంగాణ రాషా్ట్రల ప్రిన్సిపల్‌ చీఫ్‌ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి అధి కారి కావటం విశేషం. 1956లో జన్మించిన సురేష్‌ బాబు.. తిరుపతిలోని ఎస్‌వి విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌ను పూర్తి చేశారు. 1979లో భారత రెవెన్యూ సర్వీసెస్‌లో చేరి ఆంధ్రప్రదేశ్‌, ముంబై, చెన్నై, నాగ్‌పూర్‌, విశాఖపట్నంలలో పనిచేశారు. 2012లో చీఫ్‌ కమిషనర్‌గా పదోన్నతి పొందిన ఈయన బెంగళూరులో బాధ్యతలను చేపట్టి అనంతరం హైదరాబాద్‌ బదిలీ అయ్యారు. తాజాగా పదోన్నతి పొంది ఎపి,తెలంగాణ ప్రిన్సిపల్‌ చీఫ్‌ కమిషనర్‌గా నియమితులయ్యారు.