Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jun 30 2015 @ 18:45PM

మరో ఇరకాటంలో రాజస్థాన్ సీఎం

న్యూ ఢిల్లీ, జూన్ 30: ‘లలిత్ గేట్’ వ్యవహారంలో పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయిన రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజేకు మరో కష్టం వచ్చిపడింది. ప్రభుత్వ సంపదైన ధోల్‌పూర్ ప్యాలెస్‌ను వసుంధర కుటుంబం తమ ఆస్థిగా బదలాయించుకుందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఈ మేరకు దానికి సంబంధించిన 1949 నాటి పత్రాలను కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేష్ మంగళవారం మీడియా ఎదుట బహిర్గతం చేశారు. రాజస్థాన్ ప్రజల ఆస్థి ఆయిన ధోల్‌పూర్ ప్యాలెస్‌ను వసుంధర రాజే కుమారుడు దుష్యంత్ సింగ్, ఆమె భర్త హేమంత్ సింగ్ తమ ఆస్తిగా బదలాయించుకున్నారని జైరామ్ ఆరోపించారు. ఈ ఆరోపణలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కాగా, వివాదాస్పద ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ విదేశాలకు వెళ్లేందుకు సహకరించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించిన డాక్యుమెంట్‌ను కాంగ్రెస్ ఇటీవలె బహిర్గతం చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. ధోల్‌పూర్ ప్యాలెస్ ప్రజా ఆస్థి కాదని, వసుంధర రాజే కుమారుడు దుష్యంత్‌కు చెందినదని బీజేపీ వాదిస్తోంది.