Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jun 30 2015 @ 18:08PM

అరకు ఎంపీ కొత్తపల్లి గీతను అరెస్ట్ చేసే అవకాశం..
పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి రూ.25 కోట్లు స్వాహా !

ఢిల్లీ, జూన్ 30: అరకు ఎంపీ కొత్తపల్లి గీత అరెస్ట్ ప్రమాదాన్ని ఎదుర్కుంటున్నారు. తప్పుడు పత్రాలతో పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను మోసం చేసి రూ.25 కోట్లు స్వాహా చేశారన్న అభియోగాలతో సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. గీతతో పాటు ఆమె భర్త, హైదరాబాద్‌కు చెందిన ఒక కంపెనీ ఎండీపై ఈ మేరకు కేసులు నమోదయ్యాయి. ఎంపీకి సహకరించిన బ్యాంక్ అధికారులపైనా కేసులు నమోదయ్యాయి. మోసం, వంచన, తప్పుడు పత్రాలతో బుద్ధిపూర్వకంగా పక్కదారి పట్టించడం తదితర ఆరోపణలతో వీరిపై ఐపీసీలోని 120, 420, 458,421, 13(2), రెడ్ విత్ 1(సి) సెక్షన్ల కింద కేసులు పెట్టారు. త్వరలో ఎంపీ కొత్తపల్లి గీతను అరెస్ట్ చేసే అవకాశం ఉందంటున్నారు.