Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jun 30 2015 @ 13:40PM

‘ధోల్‌పూర్ ప్యాలెస్‌’ను వసుంధరా రాజే ఆక్రమించారు: కాంగ్రెస్

న్యూఢిల్లీ (జూన్ 30): లలిత్ మోదీ వ్యవహారం ఇంకా ముగియక ముందే రాజస్థాన్ సీఎం వసుంధరా రాజే మరో వివాదంలో ఇరుక్కున్నారు. లలిత్ మోదీతో కలిసి ధోల్‌పూర్ రాజసౌధాన్ని రాజే ఆక్రమించారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ఆ రాజసౌధం రాష్ట్ర ప్రభుత్వ ఆస్తి అని రాజే మాజీ భర్త హేమంత్ సింగ్ ఓ కోర్టులో అంగీకరించారని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ అన్నారు. 1954-2010 మధ్య తయారైన చాలా రెవెన్యూ పత్రాలు కూడా ఆ సౌధం ప్రభుత్వానిదేనని స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. కానీ, ప్రభుత్వ పాత్ర లేకుండా లలిత్, రాజే కలిసి ఆ సౌధాన్ని ఓ లగ్జరీ హోటల్‌గా మార్చేశారని ఆరోపించారు. ఇక 2013లో రాజే సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లో ఈ హోటల్‌లో తన కుమారుడు ధుష్యంత్ సింగ్, కోడలు నీహారిక, లలిత్ మోదీతోపాటు తనకూ షేర్లు ఉన్నట్టు పేర్కొన్నారు.
 
కాగా, కాంగ్రెస్ చేసిన ఈ ఆరోపణలను బీజేపీ కొట్టిపారేసింది. ఈ హోటల్‌కు యజమాని దుష్యంతేనని స్పష్టం చేసింది. 1956 డిసెంబర్‌లో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఓ నోటిఫికేషన్‌లో ఈ సౌధానికి చట్టబద్ధ వారసుడిగా హేమంత్ సింగ్‌నే ప్రకటించిందని బీజేపీ నాయకులు తెలిపారు. అనంతరం అతని కుమారుడైన దుష్యంత్‌కు హేమంత్ ఆ సౌధాన్ని అప్పగించారాని అన్నారు.