Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jun 30 2015 @ 12:08PM

విశాల్ కు అతని ప్రేయసి హ్యాండ్ ఇచ్చిందా ?

నడిగర్ సంఘం అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్న హీరో విశాల్... ఇప్పుడు తమిళ సినీ వర్గాల్లో స్పెషల్ అట్రాక్షన్ గా మారిపోయాడు. ఎప్పటి నుంచో శరత్ కుమార్ విశాల్ మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నా... నడిగర్ సంఘం ఎన్నికల్లో కుర్ర హీరో పోటీ చేయడంతో... ఇప్పుడు ప్రచ్ఛన్న యుద్ధం కాస్త ప్రత్యక్ష యుద్ధంగా మారిపోయింది. ఈ ఎన్నికల్లో ఎవరు ఎటు వైపు ఉంటారనే విషయం అటుంచితే... శరత్ కుమార్ కూతురు, కుర్ర హీరోయిన్ వరలక్ష్మీ ఎటు వైపు మొగ్గుచూపుతుందోననే దానిపై కొన్నాళ్లుగా కోలీవుడ్ లో చర్చ సాగుతోంది. అయితే... తన సపోర్ట్ తండ్రి శరత్ కుమార్ కే అంటూ వరలక్ష్మీ ప్రకటించడంతో... తమిళ సినీ వర్గాల్లో సరికొత్త ఊహాగానాలు చక్కర్లు ఓ సినిమాలో కలిసి నటించిన విశాల్, వరలక్ష్మీ మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ ఉందంటూ కొన్నాళ్ల క్రితం ప్రచారం జరిగింది. ఈ ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారని... ఎవరు అడ్డు చెప్పినా... వీరి పెళ్లి జరగడం ఖాయమనే వార్తలు కూడా వినిపించాయి. వరలక్ష్మీ తన జీవితంలో లభించిన ఓ అద్భుతమైన డైమండ్ అని విశాల్ కూడా ఓ సారి ఓపెన్ గా కామెంట్ చేశాడు. అలాంటి వరలక్ష్మీ తనకు దూరంగా కావడానికి ఆమె తండ్రి శరత్ కుమారే కారణమని భావించిన విశాల్... అతనిపై నడిగర్ సంఘం ఎన్నికల్లో రివెంజ్ తీర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని కొందరు అంటుంటారు. అయితే... ఈ ఎన్నికల్లో వరలక్ష్మీ ఎవరికి సపోర్ట్ చేయకుండా తటస్థంగా ఉంటుందని సినీ వర్గాలు భావించాయి. కానీ.. వరలక్ష్మీ తన తండ్రికే మద్దతు అని ప్రకటించడంతో... విశాల్, వరలక్ష్మీ మధ్య కూడా చెడిందనే గుసగుసలు మొదలయ్యాయి. మొత్తానికి... నడిగర్ సంఘం ఎన్నికలు ముగిసేలోపు.. ఈ ఎపిసోడ్ లో మరిన్ని ఊహాగానాలు వినిపిస్తాయేమో చూడాలి.