Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
May 29 2015 @ 15:31PM

‘ఐఎస్‌ఐ’ మార్కు పావురం?

పఠానకోట్‌: పావురం శాంతికి చిహ్నం. స్వాతంత్య్ర దినోత్సవాన, రిపబ్లిక్‌ దినోత్సవాన నాయకులు పావురాలను గాలిలోకి ఎగరవేసి తమ శాంతికాముకతను చాటుకుంటుంటారు. అయితే ఇప్పుడు ఓ పావురం మన భద్రతా దళాలను భయపెట్టేస్తోంది. కారణం... ఈ పావురం వంటిపై పాకిస్తాన్‌ గుర్తులు ఉండడమే! పంజాబ్‌లోని పఠానకోట్‌ ప్రాంతంలో ఉగ్రవాద కార్యకలాపాలు జరుగుతున్నట్లు అనుమానంగా ఉందని కేంద్ర ఇంటెలిజన్‌న్స బ్యూరో (ఐబీ) పంజాబ్‌ పోలీసులకు ఓ సందేశం పంపింది. దీనితో అప్రమత్తమైన పంజాబ్‌ పోలీసులు ఆ ప్రాంతంలో నిఘా పెంచారు. భారత-పాక్‌ సరిహద్దుకు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న మన్వాల్‌ గ్రామంలోని ఓ పూరింటిపై గురువారం ఓ పావురం వచ్చి వాలింది. దాని వంటిపై పాకిస్థాన్‌కు చెందిన కొన్ని గుర్తులతోపాటు ఒక వైరులాంటి పరికరం ఉండడంతో ఆ ఇంటి యజమాని కుమారుడికి అనుమానం వచ్చి దానిని పట్టుకుని సమీప పోలీసు స్టేషన్‌కు తీసుకువెళ్లాడు. ఈ పావురం శరీరం మీద ఉర్దూలో కొన్ని పదాలు, పాకిస్తాన్‌లోని నరోవల్‌ జిల్లాకు సంబంధించిన ఒక ఫోన్‌ నంబర్‌ కూడా రాసి ఉన్నట్లు తెలుస్తోంది. పావురాన్ని ఒక వెటర్నరీ డాక్టర్‌ వద్దకు తీసుకువెళ్లి దానికి ఎక్స్‌రే తీయించారు. ఈ ఎక్స్‌రేలో ఏమీ బయటపడకపోయినా పావురాన్ని నిర్బంధించి ఉంచామని, ఈ మిస్టరీ వీడే దాకా వదిలిపెట్టబోమని స్థానిక ఎస్పీ తెలిపారు.

(నోట్‌: ఫొటో సింబాలిక్‌ మాత్రమే)