Abn logo
Aug 8 2020 @ 07:53AM

LIVE: రాజధాని ఒక్కటే...అది విశాఖే!

అమరావతి: ఏపీ రాజధాని విభజన.... మూడు రాజధానులు చేస్తున్నాం... మూడు ప్రాంతాలకు న్యాయం చేస్తాం అంటూ రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నా మాట. కానీ రాజధాని ఒక్కటే...అది విశాఖ మాత్రమే అని ఇంటర్నల్‌గా వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. విశాఖపట్నాన్నే పూర్తి స్థాయి రాజధానిగా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తోంది. రాయలసీమకు రాజధాని ఇచ్చేశాం, అమరావతిని అక్కడే ఉంచుతున్నాం, కదపట్లేదు అంటూ ప్రభుత్వం చెబుతున్న మాటలు కేవలం మాటల గానే.. మాయమాటలు గానే చూడాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఎట్టిపరిస్థితిల్లో హైకోర్టును తరలించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు అని, అందుకు కేంద్ర ప్రభుత్వ అనుమతితో పాటు రాష్ట్రపతి అనుమతి కావాల్సి ఉంటుంది అని కొందమంది న్యాయనిపుణులు చెబుతున్నారు. ఇవన్నీ కూడా ప్రభుత్వం చేయదగిన పనులు కాదు అని చెబుతున్నారు. దీన్ని బట్టి హైకోర్టు రాయలసీమకు వెళ్లడమనేది అంత ఈజీ కాదని అర్ధమవుతోంది. అయితే ఒక బెంచ్ మాత్రం రాయలసీమలో పెట్టడానికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు.


అలాగే అమరావతిని శాసన రాజధానికిగా ఉంచుతున్నాం...అక్కడ శాసనసభ సమావేశాలు జరుగుతాయని చెబుతున్నారు. అదే విధంగా శాసనసభ సమావేశాలు సంవత్సరం మొత్తంలో 60 రోజుల పాటు జరగాల్సి ఉంది. అయితే  ఇప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి చూస్తే శాసనసభ సమావేశాలు జరుగుతున్న తీరును చూస్తే 60రోజులు సమావేశాలు జరుగుతున్న పరిస్థితులు ఎక్కడా కనిపించడం లేదు. దీంతో కొద్దిరోజులకు మాత్రమే అధికారయంత్రాంగం మొత్తం అమరావతికి వెళ్లడం ఇబ్బందిగా మారుతుంది కాబట్టి విశాఖలోనే రాజధాని ఉంచుతారు అనే వాతావరణం కనిపిస్తోంది. అదే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది. పేరుకు మూడు రాజధానులని చెబుతున్నప్పటికీ... అభివృద్ధి వికేంద్రీకరణ అని చెబుతున్నప్పటికీ.... రాజధానిని విశాఖకు మార్చాలన్నది ప్రభుత్వ ధృడ సంకల్పంగా కనిపిస్తోంది.


అదే జరిగితే రాయలసీమ ప్రాంత ప్రజలకు కచ్చితంగా చాలా నష్టం జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే అనంతపురం, చిత్తూరులాంటి ప్రాంతాల నుంచి విజయవాడ వచ్చేందుకే దూరమతుంది అని చాలా మంది భావిస్తున్న పరిస్థితి. వీరంతా రాజధానికి వైజాగ్ వెళ్లాలి అంటే చాలా కష్టంగా ఉండే పరిస్థితి ఉంటుంది. అలాంటి వ్యతిరేకత వస్తుంది కాబట్టే మూడు రాజధానులు అనే మాటను ప్రభుత్వం తెరపైకి తీసుకువచ్చింది అని చెబుతున్నారు. ఇదే అంశంపై ఏబీఎన్ మార్నింగ్ ఇష్యూలో చేపట్టిన చర్చలో టీడీపీ నేత మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్ నేత సుందరరామశర్మ, బీజేపీ నేత రామకుమార్, ఎనలిస్ట్ ఉప్పల్ లక్ష్మణ్ పాల్గొన్నారు. చర్చను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించండి. 

Advertisement
Advertisement
Advertisement