Abn logo
Dec 2 2020 @ 15:35PM

అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య కేసులో మళ్లీ జైలుకు..

కర్నూలు: అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య కేసులో  సీఐ సోమశేఖర్‌రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్ మళ్లీ జైలుకు వెళ్లారు. అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య కేసులో భాగంగా గతంలో సీఐ, హెడ్‌ కానిస్టేబుల్‌కు కోర్టు బెయిల్ ఇచ్చింది. బెయిల్ రద్దు కావడంతో 14 రోజుల రిమాండ్ విధించారు. కర్నూలు జిల్లా జైలుకు నిందితులను తరలించారు. నంద్యాల రోజాకుంటకు చెందిన ఆటో డ్రైవర్ సలాం కుటుంబం ఆత్మహత్యకు పాల్పడ్డ విషయం తెలిసిందే.

Advertisement
Advertisement
Advertisement