Salman Khan పెళ్లిపై స్పందించిన అతడి బామ్మర్ది

బాలీవుడ్‌ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే నటుడు సల్మాన్ ఖాన్. తాజాగా అతడు నటించిన చిత్రం ‘‘ అంతిమ్: ద ఫైనల్ ట్రూత్’’. బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ బామ్మర్ది ఆయుష్ శర్మ హీరోగా నటించాడు. ఆయుష్ శర్మ భాయిజాన్ సోదరైన అర్పితాను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.   


అంతిమ్ ప్రమోషన్లలో భాగంగా అతడు మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. సల్మాన్ ఖాన్ పెళ్లి గురించి అడగగా  స్పందించాడు. ‘‘ సల్మాన్ ఖాన్ పెళ్లి గురించి నేను మాట్లాడదల్చుకోలేదు. సల్మాన్ ఎప్పుడు పని చేస్తూనే ఫుల్ బిజీగా ఉంటాడు. పెళ్లి చేసుకునే సమయం అతడికి లేదు. ప్రస్తుతం సంతోషంగానే ఉన్నాడు. నేను భాయిజాన్ లాగా సాధారణంగా ఉండలేను. కనీస అవసరాలతో సాధారణ జీవితాన్ని గడుపడమంటే అతడికి ఇష్టం. ఫోన్‌ల మీద కూడా ఆసక్తి లేదు. గత 3 ఏళ్లుగా ఒకే ఫోన్‌ను వాడుతున్నాడు. దుస్తులు, కార్లు, గాడ్జెట్స్ వేటిని కూడా పట్టించుకోడు. సినిమాలు మాత్రమే ఇష్టం. అతడిని 2, 3 గంటలు ఒంటరిగా వదిలిస్తే సినిమాను చూస్తూ కూర్చుంటాడు ’’ అని ఆయుష్ శర్మ చెప్పాడు. 

Advertisement

Bollywoodమరిన్ని...