Abn logo
May 23 2020 @ 21:12PM

యూపీలో 2 కోట్లు దాటిన ఆరోగ్య సేతు యాప్ డౌన్‌లోడ్లు!

న్యూఢిల్లీ: కోవిడ్-19 ట్రాకింగ్ యాప్ ఆరోగ్యసేతు మరో రికార్డు క్రియేట్ చేసింది. ఉత్తరప్రదేశ్‌లో ఇప్పటి వరకు రెండు కోట్ల డౌన్‌లోడ్లు పూర్తిచేసుకుంది. రాష్ట్రంలో ఈ యాప్‌ను నిరంతరం ఉపయోగిస్తున్నారు. యాప్ సమాచారం ప్రకారం 82 మంది కరోనా బారినపడ్డారని, 45 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని ఉత్తరప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రటరీ (మెడిల్ అండ్ హెల్త్) అమిత్ మోహన్ ప్రసాద్ తెలిపారు. అలాగే, 1,079 మంది హోం క్వారంటైన్‌లో ఉన్నట్టు చెప్పారు. ఆరోగ్యసేతు యాప్‌ను ఇప్పటి వరకు రెండు కోట్ల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారని, 30,994 మంది ఫోన్ చేశారని అమిత్ మోహన్ పేర్కొన్నారు.  


ఇతర రాష్ట్రాల నుంచి వలస కార్మికులు పెద్ద ఎత్తున రాష్ట్రానికి తిరిగి వస్తున్నారని, ఆశా కార్యకర్తలు ఇప్పటి వరకు 7.44 లక్షల మందిని సర్వే చేసినట్టు ఆయన పేర్కొన్నారు. వీరిలో 844 మందిలో కరోనా లక్షణాలు కనిపించాయని, వారి శాంపిళ్లను టెస్టింగుకు పంపినట్టు తెలిపారు. వలస కార్మికుల్లో కరోనా లక్షణాలు లేకుంటే వారిని 21 రోజులపాటు హోం క్వారంటైన్‌లో ఉంచుతున్నట్టు అమిత్ మోహన్ పేర్కొన్నారు. ఒకవేళ లక్షణాలు కనిపిస్తే వారిని పరీక్షిస్తున్నట్టు చెప్పారు. పాజిటివ్ అని తేలినవారికి చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు.  

Advertisement
Advertisement
Advertisement