Advertisement
Advertisement
Abn logo
Advertisement
Oct 22 2021 @ 10:28AM

అమీర్‌ఖాన్ Hindu మనోభావాలను దెబ్బతీశారు...

బీజేపీ ఎంపీ అనంతకుమార్ హెగ్డే సంచలన వ్యాఖ్యలు

బెంగళూరు : బాలీవుడ్ మెగాస్టార్ అమీర్ ఖాన్‌పై కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ అనంతకుమార్ హెగ్డే సంచలన వ్యాఖ్యలు చేశారు.అమీర్ ఖాన్ సియట్ లిమిటెడ్ ప్రచార ప్రకటనలో ఇటీవల నటించారు. దీపావళి పండుగ సందర్భంగా రోడ్లపై క్రాకర్స్ కాల్చవద్దంటూ అమీర్ ఖాన్ టైర్ల తయారీ దిగ్గజం సియట్ లిమిటెడ్ వాణిజ్య ప్రకటనలో అమీర్ ఖాన్ కోరారు. ఈ వాణిజ్య ప్రకటనలో అమీర్ ఖాన్ హిందువుల మనోభావాలను దెబ్బతీశారని అనంతకుమార్ ఆరోపించారు. సియట్ ప్రకటనలో అమీర్ ఖాన్ చేసిన ప్రకటన హిందువుల్లో అశాంతి సృష్టించిందని ఆయన పేర్కొన్నారు. సియట్ కంపెనీ హిందువుల సెంటిమెంటును గౌరవిస్తుందని ఆశిస్తున్నానని అనంతకుమార్ సియట్ ఎండీ, సీఈవో వర్ధన్ గోయెంకాకు రాసిన లేఖలో పేర్కొన్నారు.

‘‘మీ కంపెనీ ఇటీవల విడుదల చేసిన ప్రకటనలో అమీర్ ఖాన్ ప్రజలకు వీధుల్లో క్రాకర్స్ కాల్చవద్దని సలహా ఇచ్చాడు, ఇది చాలా మంచి సందేశాన్ని ఇస్తోంది. ప్రజా సమస్యలపై మీ ఆందోళనకు ప్రశంసలు తెలుపుతున్నాను. ఈ విషయంలో రోడ్లపై ప్రజలు ఎదుర్కొంటున్న మరో సమస్యను పరిష్కరించాలని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. అంటే శుక్రవారం నమాజ్ పేరిట రోడ్లు బ్లాక్ చేయడం,అజాన్ పేరిట ముస్లిములు మసీదుల నుంచి శబ్ధ కాలుష్యాన్ని వెదజల్లుతున్నారు’’ అని అనంతకుమార్ ఆరోపించారు.దీంతో అమీర్ ఖాన్ సియట్ ప్రకటనపై వివాదం రాజుకుంది. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

జాతీయంమరిన్ని...

Advertisement