Abn logo
May 26 2020 @ 11:49AM

అమితాబ్, షారుఖ్ కామెంట్రీ చేస్తే బాగుంటుంది: అకాశ్ చోప్రా

టీం ఇండియా మాజీ ఆటగాడు ఆకాశ్ చోప్రా క్రికెటర్‌గా రాణించలేకపోయినా.. కామెంటేటర్‌గా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఎన్నో క్రికెట్ మ్యాచ్‌లకు కామెంట్రీ చెప్పిన అతను.. కామెంట్రీ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే తాజాగా ఓ సందర్భంలో అతను మాట్లాడుతూ... బాలీవుడ్ సూపర్‌స్టార్లు అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్లు కామెంట్రీ చేసే చాలా బాగుటుందని అన్నాడు. కామెంటేటర్లుగా బాలీవుడ్ నుంచి ఇద్దరు పేర్లు చెప్పమని ఆర్‌కే షోలో ఆకాశ్ చోప్రాని ప్రశ్నించారు. 


‘‘కచ్చితంగా అమితాబ్ మరియు షారుఖ్‌లే. కామెంట్రీకి సమయస్పూర్తి ఉండాలి. చాలా మంది స్టార్లు ఉన్నారు.. కానీ వాళ్లు కామెంట్రీకి పనికిరారు. అదే షారుఖ్‌ మరియు అమిత్‌లు ఏం కావాలన్న చేయగలరు. వాళ్లు గొప్ప కామెంటేటర్లు అవ్వగలరు’’ అని చోప్రా తెలిపారు. 

Advertisement
Advertisement
Advertisement