Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఇంటి బయట ఆడుకుంటున్న పిల్లలు.. లోపలి నుంచి పేలుడు శబ్దం రావడంతో షాక్.. లోపలికి వెళ్లి చూసే సరికి..

ఆ చిన్న పిల్లలిద్దరూ ఇంటి బయట ఆడుకుంటున్నారు.. లోపల అమ్మానాన్నా మాట్లాడుకుంటున్నారు.. ఇంతలో లోపలి నుంచి ఓ పేలుడు శబ్దం వచ్చింది.. షాకైన పిల్లలు లోపలికి వెళ్లి చూసేసరికి తల్లి నేలపై పడి ఉంది.. తండ్రి చేతిలో తుపాకీ ఉంది.. దీంతో వెంటనే వారు బయటకు పరిగెత్తి చుట్టు పక్కల వాళ్లకు విషయం చెప్పారు.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు సాగిస్తున్నారు. హర్యానాలోని తాజ్‌పూర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. 


తాజ్‌పూర్‌కు చెందిన దేవేంద్ర త్యాగి పదేళ్ల క్రితం రీనా అనే మహిళను వివాహం చేసుకున్నాడు. ఈ  దంపతులకు ఇద్దరు పిల్లలు. దేవేంద్ర త్యాగి ఓ సెక్యూరిటీ కంపెనీలో గన్‌మేన్‌గా విధులు నిర్వరిస్తున్నాడు. తరచుగా మద్యం సేవించే దేవేంద్ర రోజూ భార్యతో గొడవపడేవాడు. మంగళవారం సాయంత్రం పిల్లలిద్దరూ ఇంటి బయట ఆడుకుంటుండగా లోపల త్యాగి, రీనా దేని గురించో గొడవపడ్డారు. దీంతో ఆగ్రహం చెందిన త్యాగి తుపాకీతో తన భార్యను కాల్చి చంపాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. 


పిల్లలిద్దరూ తమ ఇంటి పక్కనే ఉన్న మేనమామకు విషయం చెప్పారు. అతను వెళ్లి చూసేసరికి రీనా మృతదేహం రక్తపు మడుగులో పడి ఉంది. అతను వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలిస్తున్నారు. 


Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement