Abn logo
Apr 6 2020 @ 05:46AM

మూడు రోజుల పాటు ఇంటింటి సర్వే : కలెక్టర్‌

నిర్మల్‌, ఏప్రిల్‌ 5 (ఆంధ్రజ్యోతి)/నిర్మల్‌ కల్చరల్‌ : నిర్మల్‌ పట్టణంలో క రోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని, వైద్య బృందాలతో మూడు రోజుల పాటు ఇంటింటా సర్వే నిర్వహించి వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ ముషారఫ్‌ అ లీ ఫారూఖీ తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని వైద్య ఆరోగ్య శాఖ అ ధికారి కార్యాలయంలో కరోనా నివారణకు చేపట్టిన ఇంటింటా సర్వేపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నిర్మల్‌ పట్టణాన్ని కరోనా ప్ర భావిత జోన్‌గా గుర్తించినట్లు చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు క లెక్టర్‌ కే.భాస్కర్‌ రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ వసంత్‌ రావు, తదితరులు పాల్గొన్నారు. సిబ్బందికి పీపీఈ కిట్లను కలెక్టర్‌కి ఐఎంఏ త రుపున అందించారు. రూ. 2 లక్షల విలువ గల కిట్లు ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ దేవేందర్‌ రెడ్డి, డాక్టర్‌ ప్రమోద్‌ చంద్రారెడ్డి ద్వారా అం దజేశారు. అజీమ్‌ అనే వ్యక్తి లక్ష రూపాయల విరాళాన్ని అందజేశారు. 


‘బాబూ జగ్జీవన్‌ రామ్‌ ఆశయ సాధనకు కృషి చేద్దాం’

నిర్మల్‌ టౌన్‌ : బాబు జగ్జీవన్‌ రామ్‌ ఆశయ సాధనకు కృషి చేద్దామని క లెక్టర్‌ అన్నారు. బాబు జగ్జీవన్‌ రామ్‌ జయంతి ఉత్సవాలను ఆదివారం క లెక్టరేట్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ శశిధర్‌ రాజు, అదనపు కలెక్టర్‌ భాస్కర్‌ రావు, ఏఎస్పీ శ్రీనివాస రావు, డీఆర్వో సోమేశ్వర్‌, డీఆర్డీవో అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి కి రణ్‌ కుమార్‌, డీపీఆర్‌వో కలీం తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement