Advertisement
Advertisement
Abn logo
Advertisement

రెండో రోజూ నిరసనల హోరు

నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరైన ఉద్యోగులు 

ప్రభుత్వ కార్యాలయాల వద్ద నిరసనలు

వేలాది మంది భాగస్వామ్యం

తక్షణం పీఆర్సీ అమలు, 

సమస్యల పరిష్కారానికి డిమాండ్‌

ఒంగోలు, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి) : సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ ఉద్యోగులు తలపెట్టిన ఉద్యమం రెండోరోజైన బుదవారం కూడా జిల్లాలో సంపూర్ణంగా జరిగింది. మండల, తాలూకా, డివిజన్‌, జిల్లా స్థాయి ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, ఆర్టీసీ డిపోలు తదితర ప్రాంతాల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరై నిరన తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు 11వ పీఆర్సీ అమలు, ఇతర ఆర్థిక, ఆర్థికేతర 71 అంశాల పరిష్కారం కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగ జేఏసీ, అమరావతి జేఏసీలు సంయుక్తంగా పోరాటానికి శ్రీకారం చుట్టిన విషయం విదితమే. వచ్చేనెల 6 వరకూ దశలవారీ ఉద్యమాన్ని కార్యాచరణను   ప్రకటించగా ప్రాథమికంగా నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరు, కార్యాలయాల వద్ద నిరసనలకు పిలుపునిచ్చారు. తదనుగుణంగా మంగళవారం జిల్లాలో ప్రారంభమైన నిరసన కార్యక్రమం రెండో రోజైన బుధవారం కూడా కొనసాగింది. ఒంగోలులో జేఏసీ చైర్మన్‌ శరత్‌బాబు నేతృత్వంలో నగరంలోని రిమ్స్‌ వైద్యశాలలో అక్కడి సిబ్బంది, ఎన్‌జీవో నేతలు నిరసన కార్యక్రమం నిర్వహించారు. రెవెన్యూ అసోసియేషన్‌ కలెక్టరేట్‌ యూనిట్‌ అధ్యక్షుడు ఊతకోలు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో తహసీల్దార్‌ ఆఫీసు వద్ద రెవెన్యూ ఉద్యోగులు నిరసన తెలిపారు. నగరంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు ఉద్యోగులు నల్లబ్జాడ్జీలతో విధులకు హాజరయ్యారు. మార్కాపురం జేఏసీ ఆధ్వర్యంలో అక్కడ జడ్పీ ఉన్నత పాఠ శాలలో నిరసన కార్యక్రమం చేపట్టగా, గిద్దలూరులో ఆటవీ శాఖ ఉద్యోగులు అక్కడి డీఎ్‌ఫవో కార్యాలయం వద్ద ప్రదర్శన నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా జేఏసీ నేతలు మాట్లాడుతూ తక్షణం 11వ పీఆర్సీ అమలు చేయాలని, ఉద్యోగుల, ఉపాధ్యాయుల డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.  


Advertisement
Advertisement