Abn logo
Aug 2 2021 @ 00:38AM

గోదావరిలో ఒకరి గల్లంతు

రాజ్‌కుమార్‌ (ఫైల్‌)

కుక్కునూరు, ఆగస్టు 1:  మండల పరిధిలోని పెదరావి గూడెం గోదావరి పుష్కర ఘాట్‌ వద్ద ఆదివారం బోయన పల్లి రాజ్‌కు మార్‌ (35) అనే వ్యక్తి గల్లంతయ్యాడు. రాజ్‌కుమార్‌ది తెలంగాణ లోని అశ్వారావుపేట మండలం నారాయణపురం గ్రామం. అయితే కొన్నేళ్లుగా సత్తుపల్లిలో టీ పాయింట్‌ నడుపుతూ ఒక పత్రికకు జర్నలిస్టుగా పని చేస్తున్నాడు. జామాయిల్‌ మొక్కలు కొనుగోలుకు వచ్చి గోదావరిని చూడటానికి వెళ్లి ప్రమాదవశాత్తు కాలు జారి పడినట్టు సమాచారం. ఆ సమయంలో పక్కనే ఉన్న మిత్రులు గాలించినా దొరకకపోవడంతో కుక్కునూరు పోలీసులకు సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. గల్లంతైన రాజ్‌కుమార్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.