Advertisement
Advertisement
Abn logo
Advertisement

రాత్రిపూట Carలో వెళుతుండగా ఒక్కసారిగా షాకింగ్ ఘటన.. కారులోంచి దూకి ప్రాణాలు కాపాడుకున్న Driver.. ఆ తర్వాత అంతా చూస్తుండగానే..

జోధ్‌పుర్: ప్రశాంతంగా సాగిపొతున్న జీవితం ఒక్కసారిగా ప్రాణాంతక పరిస్థితుల్లో చిక్కుకోవచ్చు. డూ ఆర్ డై సిట్యువేషన్ ఏర్పడొచ్చు. అయితే అలాంటి పరిస్థితుల్లో నుంచి మనం చాకచక్యంగా తప్పించుకోగలిగితేనే ప్రాణాలు నిలబడేది. సరిగ్గా అదే జరిగింది ఈ డ్రైవర్ విషయంలో. రోడ్డుపై వెళుతుండగానే తన కారులో మంటలు చెలరేగడంతో ఒక్కసారిగా బయటకు దూకి పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ప్రాణాలు కాపాడుకుని బతుకుజీవుడా అని బయటపడ్డాడు. ఈ ఘటన రాజస్థాన్‌లో చోటు చేసుకుంది.

స్థానిక నాగౌర్ జిల్లాలోని అతియాసన్ సమీపంలో.. ఓ వ్యక్తి తన కారులో జోద్‌పూర్ వైపు వెళుతున్నాడు. రోడ్డు ఖాళీగా ఉండడంతో హాయిగా ముందుకు సాగిపోతున్నాడు. ఎప్పటిలానే కారు డ్రైవ్ చేసుకుంటూ వెళుతున్న అతడికి ఒక్కసారిగా ఊహించని షాక్ తగిలింది. తాన కారు మంటల్లో చిక్కుకున్న విషయం అర్థమైంది. మరికొంత సేపు అలా కారులోనే ఉంటే తాను కూడా భస్మం అయిపోతాననే భయంలో బిగుసుకుపోయాడు. కానీ క్షణాల్లోనే తేరుకుని కదులుతున్న కారులో నుంచి బయటకు దూకేశాడు. అదృష్టవశాత్తూ చిన్న చిన్న గాయాలతో బయటపడ్డాడు. డ్రైవర్ లేకపోవడంతో కారు కొంత దూరం వెళ్లి నిలిచిపోయింది. క్షణాల్లోనే కారును మంటలు చుట్టుముట్టాయి. పూర్తిగా దగ్ధం చేసేశాయి. ఎలాగోలా ప్రాణాలు కాపాడుకోవడంతో సదరు డ్రైవర్ ఊపిరి పీల్చుకున్నాడు.

కారు మంటల్లో కాలిపోతుండడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలంతా అక్కడికి చేరుకుని గుమిగూడి చూడసాగారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. వారికి కొందరు స్థానికులు కూడా సాయం చేశారు. కానీ  ప్రయోజనం లేకపోయింది. కారు పూర్తిగా దగ్ధమైన తరువాతనే మంటలు చల్లారాయి. ప్రాణాపాయం నుంచి  స్వల్ప గాయాలతో తృటిలో బయటపడిన డ్రైవర్.. అక్కడే ప్రాథమిక చికిత్స చేయించుకుని వెళ్లిపోయినట్లు సమాచారం.

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement