Abn logo
Jun 5 2020 @ 16:16PM

‘ఏ’ మూవీ టీజర్ విడుదల చేసిన సంతోష్ శివన్

పరిమిత  బడ్జెట్ తో నిర్మితమైన చిత్రం ‘ఏ’. తాజాగా ఈ సినిమా టీజర్‌ను ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ విడుదల చేశారు. లెజెండరీ ఫిల్మ్‌మేకర్ సింగీతం శ్రీనివాస్‌ను తన ప్రేరణగా భావించిన దర్శకుడు యుగంధర్  ముని చేసిన ప్రయత్నంగా కనపడుతుంది. థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన ఈ సినిమా టీజర్ చూస్తుంటే ఆసక్తికరంగా ఉంది. ఇందులో హీరోగా నటించిన నితిన్ ప్రసన్న  3 విభిన్నమైన పాత్రలను పోషించాడు.  మళ్ళీరావా, ప్రెషర్ కుక్కర్ సినిమాలలో పక్కింటి అమ్మాయిగా కనిపించిన ప్రీతీ అశ్రాని ఈ చిత్రంలో హీరోయిన్.


Advertisement
Advertisement
Advertisement