Advertisement
Advertisement
Abn logo
Advertisement

మూత్రవిసర్జన కోసం Toiletకు వెళ్లాడు.. రక్త గాయాలతో బయటికొచ్చాడు.. విషయం తెలిసి అంతా షాక్..!

న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్‌లో ఓ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. టాయిలెట్‌కు వెళ్లిన ఓ వ్యక్తి.. రక్త గాయాలతో బయటికి పరుగెత్తుకుంటూ వచ్చాడు. ఈ ఘటనతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. చావును వెంటే పెట్టుకున్నట్లు.. అతడు చావును జేబులో పెట్టుకుని తిరిగాడు. చివరకు చావు తప్పి.. కన్ను లొట్టబోయిన చందంగా బతికి బట్ట కట్టాడు. ఈ వార్త విన్న వారంతా ఇతనేంటి మరీ ఇంత అమాయకుడిలా ఉన్నాడు.. అంటూ అశ్చర్యపోయారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. 


టైమ్స్ స్వ్కేర్‌లోని సబ్‌వే స్టేషన్‌ జనంతో రద్దీగా ఉంది. ఈ సమయంలోనే పింక్ కలర్ షర్ట్ వేసుకున్న 39 ఏళ్ల వ్యక్తి.. టాయిలెట్ నుంచి భయంతో బయటకు పరుగులు తీస్తూ వచ్చాడు. రక్త గాయాలతో ఉన్న అతన్ని చూసి.. అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు.. గాయపడిన అతన్ని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు అతన్ని విచారించగా.. అసలు విషయం తెలిసింది.

టాయిలెట్‌కు వెళ్లిన వ్యక్తి జేబులో అప్పటికే బుల్లెట్లు లోడ్ చేసిన గన్ ఉంది. లోపలికి వెళ్లిన అతను.. ఫ్యాట్ జిప్ తీసే క్రమంలో పొరపాటున గన్ ట్రిగర్ నొక్కాడు. దీంతో ఒక్కసారిగా పెద్ద శద్ధం వినపడింది. బుల్లెట్ నేరుగా అతడి తొడలోకి దూసుకెళ్లింది. దీంతో తీవ్ర గాయమైంది. అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డ్ మైఖేల్ బౌయీయా.. భయంతో బయటికి పరుగులు తీసి.. అక్కడున్న వారికి విషయం తెలిపాడు. ఊహించని ఈ ఘటనతో స్థానికులంతా షాక్‌ అయ్యారు. అదే రోజు ఓ మహిళ రైలు నుంచి కింద పడింది. అదృష్టవశాత్తు స్వల్ప గాయాలతో బయటపడింది. గంటల వ్యవధిలో ఇద్దరికీ.. తృటిలో ప్రాణాపాయం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. గాయపడ్డ వ్యక్తి ప్రస్తుతం కోలుకుంటున్నాడని వైద్యులు తెలిపారు. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement