Abn logo
May 22 2020 @ 10:48AM

నాన్నా.. నేను చనిపోతున్నా.. అంటూ రాత్రి పూట తండ్రికి ఫోన్.. చివరకు..

భార్య కాపురానికి రాలేదని భర్త ఆత్మహత్య

మోమిన్‌పేట (రంగారెడ్డి): భార్య కాపురానికి రాలేదనే మనస్థాపంతో భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన స్థానిక పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. మర్పల్లి మండలం రావులపల్లి గ్రామానికి చెందిన నల్ల సాయిలు (36) హైదరాబాద్‌లోని పోస్టాఫీసులో విధులు నిర్వహిస్తూ అక్కడే నివా సం ఉండేవాడు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో భార్య, ఇద్దరు కుమారులతో కలిసి ఇంటికి వచ్చాడు. హైదరాబాద్‌లో విధులు నిర్వర్తించడం ఇబ్బందిగా ఉం దని మోమిన్‌పేట పోస్ట్‌ ఆఫీ్‌సలో క్లర్క్‌గా చేరాడు. ఇదిలా ఉండగా గత కొన్ని రోజులుగా సాయిలు కుటుంబంలో గొడవల కారణంగా అతని భార్య సంతోష 20 రోజుల క్రితం కొండాపురం మండలం మల్కాపురంలోని తన పుట్టింటికి వెళ్లింది. బుధవారం సాయిలు భార్యకు ఫోన్‌చేసి ఇంటికి రావాలని చెప్పగా, ఆమె తన పిల్లలతో హైదరాబాద్‌కు వెళ్లినట్టు చెప్పింది. దీంతో మనస్థాపం చెంది సాయిలు కేసారం గ్రామశివారులో పురుగుల మందు తాగి తాను చనిపోతున్నట్లు తండ్రి ఆనందంకు రాత్రి 7 గంటలకు ఫోన్‌ చేశాడు. ఆచూకి కోసం వెతకగా గురువారం ఉదయం 5 గంటలకు మృతదేహం లభ్యమైంది. మర్పల్లిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. తండ్రి ఆనందం ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రవికుమార్‌ తెలిపారు.

Advertisement
Advertisement
Advertisement