Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఘనంగా బురదమాంబ ఉత్సవం

మురుగు రాసుకుని అమ్మవారిని స్మరించుకున్న భక్తులు

అమ్మవారి దర్శనానికి తరలివచ్చిన మహిళలు


రాంబిల్లి, నవంబరు 30: దిమిలి గ్రామంలో మంగళవారం బురదమాంబ అమ్మవారి ఉత్సవం ఘనంగా జరిగింది. తెల్లవారు జాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో తరలిచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు వేపకొమ్మ చేతబూని మురుగు కాలువలో ముంచి ఒంటికి పూసుకున్నారు. వేపకొమ్మలతో మురుగును ఒకరిపై ఒకరు జల్లుకొని పురవీధుల్లో కేరింతలు కొట్టారు. ఉత్సవాన్ని మహిళలు ఆసక్తిగా తిలకించారు. మురుగునీటిని ఉత్సవంలో ఒంటికి రాసుకున్నా  ఎటువంటి వ్యాధులు రావని భక్తులు చెప్పారు. తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు, పలువురు గ్రామ నాయకులుతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం వేపకొమ్మలు పట్టుకొని ఉత్సవంలో పాల్గొన్నారు. 

Advertisement
Advertisement