Abn logo
Mar 28 2020 @ 11:01AM

క‌రోనా వైర‌స్‌పై తెలుగు సినిమా..?

ట్రెండింగ్‌లోని విష‌యాల‌ను ఆధారంగా చేసుకుని సినిమాల‌ను రూపొందించ‌డం సాధార‌ణంగా జ‌రిగే విష‌య‌మే. అయితే కొన్ని సినిమాలు స్టార్ట్ అయిన త‌ర్వాత అలాంటి ప‌రిణామాలు సంభవిస్తే మాత్రం విచిత్ర‌మే. ఇప్పుడు అంత‌ర్జాతీయ స్థాయిలో క‌రోనా వైర‌స్ ప్ర‌భావంతో ప్ర‌జ‌లు భ‌యం గుప్పిట్లో బ్ర‌తుకుతున్నారు. ఈ నేప‌థ్యంలో తెలుగులో క‌రోనా వైర‌స్‌పై ఓ సినిమా రాబోతుందా? అది ఎప్పుడో షూటింగ్ స్టార్ట్ అయ్యిందా? అవుననే స‌మాధానం విన‌ప‌డుతుంది.


వివరాల్లోకెళ్తే.. అ!, క‌ల్కి సినిమాలను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ ఓ భ‌యంక‌రమైన వైర‌స్ ప్ర‌జ‌ల‌ను ఇబ్బంది పెడిగే ఎలాంటి ప‌రిస్థితులు నెల‌కొంటాయ‌నే దానిపై ఓ సినిమాను తెర‌కెక్కిస్తున్నాడ‌ట‌. గ‌త న‌వంబ‌ర్‌లోనే సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఇప్ప‌టికే స‌గం షూటింగ్ కూడా పూర్తి చేసుకుంద‌ట‌. అంతా కొత్త‌వాళ్లే ఈ చిత్రంలో న‌టిస్తున్నార‌ని స‌మాచారం. మరి దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి ఇంత వరకు పేరు పెట్టలేదట. మరి కరోనా వైరస్ అని పేరు పెడతాడేమో చూడాలి.

Advertisement
Advertisement
Advertisement