Abn logo
May 28 2020 @ 04:52AM

కరోనాఘంటికలు

కలవరపెడుతున్న వైరస్‌

కొండారెడ్డిపల్లిలో ఒకరికి పాజిటివ్‌

గుడేబల్లూరులో చనిపోయిన వ్యక్తికి కరోనా

కేసులు పెరుగుతుండడంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఆందోళన


మహబూబ్‌నగర్‌, మే 27 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి)/నాగర్‌కర్నూల్‌-ఆంధ్రజ్యోతి/కల్వకుర్తి అర్బన్‌/మక్తల్‌ రూరల్‌ : కరోనా ఘంటికలు మోగుతున్నాయి. పాజిటివ్‌ కేసులు మళ్లీ మొదలవడంతో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఆందోళన పెరుగుతోంది. బుధవారం నాగర్‌కర్నూల్‌ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో ఒకరికి కరోనా రాగా, నారా యణపేట జిల్లా కృష్ణ మండలం గుడేబల్లూరులో చనిపోయిన వ్యక్తికి కరోనా పాజిటివ్‌ ఉ న్నట్లు నిర్ధారణ అయ్యింది. గుడేబల్లూరుకు చెందిన వ్యక్తి ఈ నెల 21న హైదరాబాద్‌లోని చెస్ట్‌ ఆసుపత్రిలో చికిత్సకు చేరగా, కరోనా పరీక్షలు నిర్వహించారు. బుధవారం అతను చ నిపోవడంతో పాటు, కరోనా పరీక్షల్లో పాజిటివ్‌గా వచ్చింది. దీంతో ఇతని కాంటాక్ట్‌ ఉన్న 11 మందిని, ఆ గ్రామంలోని స్కూల్‌ వద్ద ఏర్పాటు చేసిన క్వారంటైన్‌లో ఉంచి చికిత్స ని ర్వహించాలని అధికారులు సూచించారు. ఇదే జిల్లాలోని మక్తల్‌ మండలం జక్లేర్‌లోనూ మంగళవారం నాలుగు నెలల బాబుకి కరోనా రావడంతో హైదరాబాద్‌కు తరలించారు. ఈ గామ్రంలో కాంటాక్ట్‌ ఉన్న 68 మందిని హోం క్వారంటైన్‌ చేయగా, ఈ గ్రామాన్ని కం టైన్మంట్‌ జోన్‌గా ప్రకటించి కట్టుదిట్టం చేశారు. ఈ కేసులతో పాటు జిల్లాల సరిహద్దు లోని షాద్‌నగర్‌లో నాలుగు కేసులు, కుల్కచర్ల మండలంలో మరో రెండు కేసుల నమో దవడంతో రాకపోకలపై ఆందోళన వ్యక్తం అవుతోంది.


కల్వకుర్తిని వీడని వైరస్‌

కల్వకుర్తి నియోజకవర్గాన్ని వైరస్‌ వదలడం లేదు. కొండారెడ్డిపల్లి గ్రామానికి ఓ వ్య వసాయదారుడికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. దీంతో నాగర్‌కర్నూల్‌ జిల్లాలో నా లుగు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో మూడు కేసులు కల్వకుర్తి నియోజక వర్గానికి సంబంధించినవే ఉన్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం కలెక్టర్‌ ఈ.శ్రీధర్‌ కల్వకు ర్తి ఆర్‌డీఓ కార్యాలయంలో అధికారులతో సమావేశమయ్యారు. 23న చారకొండ మండ లం రామచంద్రాపురంలో ఒకరికి కరోనా పాజిటివ్‌ రావడంతో ప్రైమరీ కాంట్రాక్ట్‌గా ఉన్న 44 మందిని, సెకండరీ కాంట్రాక్ట్‌గా 88 మందిని గుర్తించి క్వారంటైన్‌లో ఉంచామని చె ప్పారు. అందులో ముగ్గురికి కరోనా పరీక్షలు నిర్వహించగా, నెగటివ్‌ నివేదికలు వచ్చినట్లు చెప్పారు. కొండారెడ్డిపల్లి గ్రామంలో ఒకరికి కరోనా పాజిటివ్‌ రావడంతో అతనితో ప్రైమరీ కాంటాక్ట్స్‌ ఉన్న 14 మందిని గుర్తించామని కలెక్టర్‌ తెలిపారు.


కట్టడిలో జక్లేర్‌

నారాయణపేట జిల్లా మక్తల్‌ మండలం జక్లేర్‌ గ్రామంలో  నాలుగునెలల బాలుడికి కరోనా పాజిటివ్‌ రావడంతో బుధవారం కలెక్టర్‌ హరిచందన, ఎస్పీ చేతన, డీఎంహెచ్‌వో జె.చంద్రమోహన్‌ తదితరులు ఆ గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలో పరిస్థితిని పర్య వేక్షించాక, గ్రామస్థులందరికి ఫీవర్‌ సర్వే నిర్వహించాలని  కలెక్టర్‌ వైద్య సిబ్బందిని ఆదే శించారు. ప్రజలు భయాందోళన చెందవద్దని, ఎవరికైనా కరోనా లక్షణాలు అగుపిస్తే తక్ష ణమే ప్రభుత్వం వారికి కావాల్సిన చికిత్స అందిస్తుందని కలెక్టర్‌ భరోసానిచ్చారు. గ్రామ స్థులంతా స్వీయ నిర్బంధంలో ఉండాలని, ఎలాంటి రాకపోకలకు అనుమతించరాదన్నారు. కరోనా సోకిన బాలుడి నామకరణానికి హాజరైన 73 మందిని హో క్వారంటైన్‌లో ఉండాల ని సూచించారు. కార్యక్రమంలో డీఐఓ శైలజ, ఆర్డీవో శ్రీనివాసులు, ఐసోలేషన్‌ అధికారి సి ద్ధప్ప, ఎంపీడీవో రాజేందర్‌గౌడ్‌, పావని, డాక్టర్‌ నరేష్‌చంద్ర పాల్గొన్నారు.

Advertisement
Advertisement