Abn logo
Jul 11 2020 @ 05:27AM

ఊపిరి పోయండి!

మృత్యువుతో పోరాడుతున్న చిన్నారి

ఆదుకోవాలని తండ్రి విన్నపం


గూడూరు, జూలై 10: తల్లిదండ్రుల ఒడిలో ఆడుతూపాడుతూ గడపాల్సిన చిన్నారిని ప్రమాదం రూపంలో విధి అచేతనంగా మార్చింది. లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తే.. బాలుడిని పూర్వ స్థితికి తీసుకురావడం సాధ్యమని వైద్యులు తేల్చిచెప్పారు. రెక్కాడితేగానీ డొక్కాడని ఆ కుటుంబానికి ఈ పరిస్థితి అశనిపాతమే అయ్యింది. ఈ నేపథ్యంలో ఆపన్నహస్తం అందించి తన కుమారుడిని కాపాడాలని తండ్రి వేడుకుంటున్నాడు


కోట పట్టణానికి చెందిన నవీన్‌ జయశ్రీ దంపతుల కుమారుడు షణ్ముగ శశాంక్‌(4) ఈనెల 2న ప్రమాదవశాత్తూ కిందపడడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. నెల్లూరులోని ఆస్పత్రికి తరలించగా తలకు తగిలిన గాయం బ్రెయిన్‌ట్యూమర్‌గా మారిందని వైద్యులు తెలిపారు.  దీంతో కోమాలోకి వెళ్లిపోయిన చిన్నారిని చెన్నైలోని కిమ్స్‌ ఆస్పత్రికి తరలించగా, చికిత్సకు రూ.30 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు స్పష్టం చేశారు.  బార్బర్‌ షాపులో పనిచేసే నవీన్‌కు అంత స్థోమత లేకపోవడంతో ఆపన్నులు ఆదుకోవాలని కోరుతున్నాడు.  ఇప్పటిదాకా   సాయం అందించిన దాతలకు ధన్యవాదాలు తెలపడంతోపాటు, మరింత మంది ముందుకు వచ్చి తన బిడ్డ ప్రాణాలు కాపాడాలని నవీన్‌ వేడుకుంటున్నాడు. 

Advertisement
Advertisement
Advertisement