Advertisement
Advertisement
Abn logo
Advertisement

రెండ్రోజులుగా దిగాలుగా కనిపిస్తున్న 12 ఏళ్ల కూతురు.. దగ్గరకు తీసుకుని ఏమైందని తల్లి అడిగితే ఆ బాలిక చెప్పింది విని..

ఇంటర్నెట్ డెస్క్: ఆ చిన్నారికి 12ఏళ్లు. ఆమెకు తండ్రి లేడు. తల్లి, ఇద్దరు సోదరులు ఉన్నారు. తల్లితోపాటే ఇద్దరు సోదరులు పనికి వెళ్తుంటే.. ఆ అమ్మాయి మాత్రం ఇంటిపట్టునే ఉంటూ ఆడుకునేది. ఎప్పుడూ ఉత్సాహంగా కనిపించే ఆ చిన్నారి.. గత రెండు రోజులుగా దిగాలుగా ఉండటాన్ని తల్లి గమనించింది. పని నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఆ చిన్నారిని దగ్గరకు తీసుకుని, ఏమైందంటూ ఆరా తీసింది. దీంతో ఆ బాలిక చెప్పింది విని, ఆ తల్లి షాకయింది. ఆ తర్వాత ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే.. 


మధ్యప్రదేశ్‌కు చెందిన 12ఏళ్ల బాలికకు ఇద్దరు సోదరులు. వారిలో ఒకరి పేరు అంకిత్. 20ఏళ్ల అంకిత్ తన తమ్ముడు, అమ్మతో కలిసే రోజూ కూలీ పనులకు వెళ్లేవాడు. అయితే కొద్ది రోజులుగా పని దొరకకపోడంతో.. అంకిత్ ఇంటి వద్దే ఉంటున్నాడు. ఈ క్రమంలోనే ఫోన్‌‌లో అశ్లీల వీడియోలు చూస్తూ.. వాటినికి బానిసయ్యాడు. అక్టోబర్ 24న మధ్యాహ్నం ఇంట్లో ఎవ్వరూ లేని సమయాన్ని చూసి.. అంకిత్ తన 12ఏళ్ల చెల్లెలిపై అత్యాచారం చేశాడు. అంతేకాకుండా ఈ విషయం ఎవరికైన చెబితే చంపేస్తానంటూ బెదిరించాడు. 


దీంతో జరిగిన విషయాన్ని ఎవరితో చెప్పులేక.. ఆ చిన్నారి లోలోపలే కుమిలిపోయింది. కాపాల్సిన సోదరుడే.. కాటేయడంతో ఆవేదన చెందింది. కాగా.. రెండు రోజులుగా దిగాలుగా ఉంటున్న కూతురుని గమనించిన తల్లి, విషయం ఆరా తీసింది. దీంతో ఆ చిన్నారి.. జరిగిన ఘోరం చెప్పింది. ఈ క్రమంలో అంకిత్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె.. పోలీసు స్టేషన్‌కు వెళ్లి, కొడుకుపై స్వయంగా ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అంకిత్‌ను అరెస్ట్ చేసి, జైలుకు తరలించారు. కాగా.. ఈ విషయం స్థానికంగా చర్చనీయాంశం అయింది. 


ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement