Abn logo
Sep 30 2020 @ 03:38AM

లోపభూయిష్టమైన ఆయుధాల కొనుగోలు

  • 2014-20 మధ్య ఖజానాకు 960 కోట్లు నష్టం: ఆర్మీ నివేదిక 


న్యూఢిల్లీ, సెప్టెంబరు 29: లోపభూయిష్టమైన ఆయుధాల కొనుగోలు వల్ల రూ.960 కోట్ల నష్టం వాటిల్లిందని సైన్యం.. రక్షణశాఖకు సమర్పించిన అంతర్గత  నివేదికలో ఆక్షేపించింది. ఈ సొమ్ముతో 100 శతఘ్నులను కొనుగోలు చేయవచ్చని పేర్కొంది. ఈ కొనుగోళ్లు 2014-20 మధ్య జరిగాయని వెల్లడించింది. ప్రభుత్వ అధీనంలోని ఆర్డ్‌నెన్స్‌ ఫ్యాక్టరీ బోర్డ్‌(ఓఎ్‌ఫబీ) ఈ పనికి మాలిన ఆయుధాలను సరఫరా చేసినట్లు తేలింది. లోపాలతో నిండిన ఆయుధాల్లో 125ఎంఎం ఎయిర్‌ డిఫెన్స్‌ షెల్స్‌, ఫిరంగి గుళ్లు, 125ఎంఎం ట్యాంక్‌ రౌండ్స్‌, వివిధ రకాల రైఫిళ్లలో వాడే బుల్లెట్లు ఉన్నాయి. ‘లోపాలతో కూడిన ఈ ఆయుధాలు సైనికుల ప్రాణాలను హరిస్తున్నాయి.2014లోనే 403 ప్రమాదాలు జరిగాయి. 27 మంది జవాన్ల ప్రాణాలు తీశాయి. 159 మందికి బులెట్‌ గాయాలై పనిచేయలేని స్థితికి చేరుకున్నారు. ఈ ఏడాది ఇప్పటిదాకా 13 ప్రమాదాలు జరిగాయి’ అని ఆర్మీ నివేదిక తెలిపింది. 

Advertisement
Advertisement
Advertisement