Advertisement
Advertisement
Abn logo
Advertisement

‘విద్యాదీవెన’తో 95వేల మంది విద్యార్థులకు లబ్ధి

చిత్తూరు (సెంట్రల్‌), నవంబరు 30: విద్యాదీవెన పథకం కింద జిల్లాలోని 95,415 మంది విద్యార్థులకు లబ్ద్ధి చేకూరినట్లు డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. మంగళవారం తాడేపల్లి నుంచి సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పథకాన్ని ప్రారంభించగా, కలెక్టరేట్‌ నుంచి మంత్రులు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. మూడో విడతగా 95,415 మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చేయడంతో 84,793 మంది తల్లుల బ్యాంకు ఖాతాల్లో రూ.56.63 కోట్లు జమ చేశారన్నారు. కలెక్టర్‌ హరినారాయణన్‌, జడ్పీ చైర్మన్‌ వాసు, ఎమ్మెల్సీ భరత్‌, సత్యవేడు, మదనపల్లె ఎమ్మెల్సీలు ఆదిమూలం, నవాజ్‌ బాషా, ఆర్టీసీ వైస్‌ చైర్మన్‌ విజయానందరెడ్డి, మొదలియార్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ బుల్లెట్‌ సురేష్‌, జేసీ రాజశేఖర్‌, ఆర్డీవో రేణుక, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement