Abn logo
Apr 2 2020 @ 09:35AM

తూర్పు గోదావరిలో 9కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

కాకినాడ: జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు తొమ్మిదికి  చేరుకున్నాయి. కొత్తపేటకు చెందిన ఒకే కుటుంబంలో ముగ్గురికి  పాజిటివ్ రావడంతో కోనసీమలో కలకలం రేగింది. రాజమండ్రిలోని కరోనా ఆసుపత్రిలో కొత్తపేటకు చెందిన బాధితులు చికిత్స పొందుతున్నారు. రాజమండ్రి శాంతినగర్‌లో కరోనా పాజిటివ్ బాధితుడి (72)  కుటుంబానికి చెందిన  కోడలు(36), మనవడు (18), మనవరాలు (16)కి కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. కుమారుడి రిపోర్ట్ పెండింగ్‌లో ఉంది. ఇంకా అనుమానిత  కేసులపై ఫలితాలు రావల్సి ఉంది.   90 అనుమానిత  కేసుల్లో 69  నెగిటివ్ అని తేలింది. పాజిటివ్ వచ్చిన  రోగుల  ఇళ్ల చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిలో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు.

Advertisement
Advertisement
Advertisement