Abn logo
Jan 18 2021 @ 02:11AM

13ఏళ్ల బాలికపై రెచ్చిపోయిన కామాంధులు

భోపాల్‌, జనవరి 17: మధ్యప్రదేశ్‌లోని ఉమారియా జిల్లాలో 9మంది కామాంధులు రెచ్చిపోయారు. 13ఏళ్ల బాలికను పలుమార్లు అపహరించి, రెండు వారాల వ్యవధిలో మూడుసార్లు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. బాలికకు బాగా తెలిసిన వ్యక్తి ఈ నెల 4న ఆమెను అపహరించాడు. తన స్నేహితులు మరో ఆరుగురితో కలిసి ఆమెపై మరుసటి రోజు వరకూ అత్యాచారం జరిపాడు. ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించి 5న ఆమెను వదిలేశాడు. ఈ నెల 11న నిందితుల్లో మరొకరు ఆమెను మళ్లీ అపహరించి అడవుల్లో బంధించాడు. అంతకుముందు రేప్‌ చేసిన వారిలో ముగ్గురితో కలిసి మళ్లీ ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. వారు వదిలేసిన అనంతరం ఇద్దరు లారీ డ్రైవర్లు బాలికను రేప్‌ చేశారు. వారి చెర నుంచి తప్పించుకున్న బాధితురాలు, ఇంటికి చేరుకుని తల్లిదండ్రులకు జరిగింది చెప్పింది. నిందితుల్లో ఏడుగురిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నామని, మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టామని స్థానిక పోలీసులు తెలిపారు.

Advertisement
Advertisement
Advertisement