Abn logo
Jun 1 2020 @ 21:17PM

వలస కార్మికులకు ఉచిత సేవలు అందిస్తున్న రైల్వే కూలీ

లఖ్‌నవూ: క్లిష్ట సమయాల్లో ఒక మనిషి సాయం ఎదుటి వ్యక్తలకు ఎంత అవసరమో కరోనా నిరూపించింది. అలాగే సమాజంలో మానవత్వం ఉన్న మనుషులు ఎంతో మంది ఉన్నారని కూడా తెలియజేసింది. లాక్‌డౌన్‌లో పేదలకు ఎంతో మంది వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థలు మాటల్లో వర్ణించలేని కృషి చేశాయి, చేస్తూనే ఉన్నాయి. ఈ తరుణంలో లఖ్‌నవూ రైల్వే స్టేషన్‌లో ఓ రైల్వే కూలీ వలస కార్మికులకు అందిస్తున్న సాయాన్ని ప్రముఖంగా చెప్పుకొవాలి. అతను చేస్తున్న సాయంతో ఎంతోమంది హృదయాలను గెలుచుకుంటున్నారు. అతని పేరు ముజిబుల్లా. ఉత్తరప్రదేశ్‌లోని లఖ్‌నవూ రైల్వే స్టేషన్‌లో కూలీ. వలస కార్మికుల సామాన్లను ఉచితంగా మోస్తూ తన వంతు కృషి చేస్తున్నారు.


ముజిబుల్లా ఈ వయసులో కూడా ప్రతిరోజూ 8-10 గంటలు పని చేస్తున్నారు. 50 కిలోల బరువును సైతం మోయగలడు. ‘ఖిద్‌మత్’ అని పేరుతో వలస కార్మికుల సామాన్లను ఉచితంగా మోస్తున్నట్లు చెప్పారు. ఇది తన కర్తవ్యం అని, ఈ విధి చాలా ముఖ్యమైనదని ఆయన అన్నారు. దీంతో పాటు రైళ్లలో ప్రయాణికులకు ఆహారం, నీరు అందిస్తున్నారు. అయితే సంపాదన గురించి అడిగితే పరిస్థితులు మెరుగుపడిన తర్వాత సంపాదించగలనని చెప్పుకొచ్చారు.

Advertisement
Advertisement
Advertisement